శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం

శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం
శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం,PH:-9963653907,9949621214,9705934635,9705934633,9676453548.

జాతక చక్రం

24, ఆగస్టు 2010, మంగళవారం

శంఖాలు


శంఖే చంద్ర మావాహయామి

కుక్షే వరుణ మావాహయామి

మూలే పృధ్వీ మావాహయామి

ధారాయాం సర్వతీర్థ మావాహయామి

శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ దీని ధ్వని శోభను పెంచుతుంది. దీని పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలో శంఖం ఒకటి విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి సముద్రతనయ అయివున్నది.

శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు వున్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజలు వల్ల వాళ్లకు ఎంతో అభివృద్ధికల్గేది. దీనికి అనేక రకాల పూజా విధానాలు కలవు. పూర్వం కొన్నింటిని గృహ కృత్యాలలో తప్పనిసరిగా వాడేవారు.

శంఖాలలో చాలా రకాలు వున్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు కలువు. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేయును. సుఖ సంతోషాలను కలగజేస్తుంది. ఈ శంఖాలు మానససరోవర్‌, లక్షద్వీప్‌, కోరమండల్‌, శ్రీలంక, భారతదేశంలోను లభిస్తున్నాయి. శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని విభజిస్తారు ముఖ్యంగా 3 రకాలు 1. దక్షిణావృత శంఖం, 2. మధ్యావృత శంఖం, 3. ఉత్తరావృతవ శంఖం. ఎడమ చేతితో పట్టుకునే దానిని దక్షిణావృతమని కుడిచేతితో పట్టుకునే దానిని ఉత్తరావృత శంఖమని మధ్యలో నోరు వున్నదానిని మధ్యావృతమని అంటారు. ఈ శంఖాల పేర్లు ఈ విధంగా ఉన్నవి. 1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6. గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం, భారత యుద్ధ సమయంలో అనేక రకాల శంఖాలు పూరించారు.

ఉదా:- శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌంఢ్ర శంఖాన్ని యుధిష్ఠరుడు అనంత విజయ శంఖాన్ని, నకులుడు సుఘోష శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పక శంఖాన్ని, కాశీరాజు శిఖండి శంఖాన్ని దుష్ఠ ద్యుమ్నుడు, విరాటుడు స్వాతిక శంఖాన్ని అలాగే ఇతర రాజులు అనేక రకాల శంఖాలు పూరించారు.

శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక, శంఖాన్ని శివపూజకు, పూజనందు ఆరతి ఇచ్చేటప్పుడు ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన ఖర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుపాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి.

విష్ణు శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నాసహోదరి అని చెప్పిన సందర్భాలు కలవు. దేవి యొక్క పాదాలు వద్ద శంఖాన్ని వుంచుతారు. శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు. ఆడ మగ శంఖాలని రెండు కలిపి స్తాపించాలి.

గణేష్ శంకాలలో నీరు నింపి గర్భవతులకు త్రాగించినట్లయితే గ్రుడ్డి, కుంటి, మూగ మొదలైన సంతానం కలగదు. అన్నపూర్ణ శంఖాన్ని ఆహారపదార్థాలలో స్థాపించి పూజిస్తారు. మణిపుష్పక్‌, పాంచ జన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. చిన్న శంఖ మాలలను ధరించి కూడా అనేక సిద్ధులను పొందుచున్నారు.

శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని -అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. శంఖ బస్మము వల్ల అనేక రోగాలు నయము అగుచున్నవి. ఋషి శృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. దానివల్ల భక్తుల కోర్కెలు తీరును. ఈ శంఖాలు వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుచున్నవి. శంఖము పాపనాశిని ప్రతి ఇంటిలోను శంఖము వుండవలసిన వస్తువు శంఖము వున్న ఇల్లు లక్ష్మీ నివాసము.

కొన్ని శంఖాల వివరణ:

దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. దక్షణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలున్నవి. పాంచజన్యం పురుష శంఖం ఇది దొరుకుట కష్టం. శని శంఖాలకు నోరు పెద్దది పొట్ట చిన్నది. రాహు, కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి. ముత్యపు శంఖాలు పాలిష్‌ వల్ల వెండిలా మెరుస్తూ వుంటాయి. వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, పంది ఆకారంలో ఉంటాయి. శంఖాలు ఎక్కువుగా రామేశ్వరం, కన్యాకుమారి, మద్రాసు, విశాఖపట్నం కలకత్తా, బొంబాయి మరియు పూరీలో ఎక్కువుగా దొరుకుచున్నవి.

సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహీ తన్నో శంఖప్రచోదయాత్‌

8, ఆగస్టు 2010, ఆదివారం

లాఫింగ్ బుద్ధ


ఫెంగ్ షుయ్ లో ముందుగా మనకు ఎదురయ్యే ఆర్టికల్ లాఫింగ్ బుద్ధ. ఐశ్వర్యం, ఆనందం ఈ రెంటినీ లాఫింగ్ బుద్ధ అందిస్తుంది. అటు ఇంట్లో ఇటు మీ వ్యాపార సంస్థలో లాఫింగ్ బుద్ధను ఉంచుకోవడం వల్ల కుటుంబపరంగా, వ్యాపారపరంగా మీకు మంచి మేలు జరుగుతుంది.

సౌత్ ఈస్ట్ లో లాఫింగ్ బుద్ధను ఉంచితే జీవితంలో అబివృద్ధి, అదృష్టం... రెండు ద్విగుణం బహుళం అవుతాయి. వ్యాపారం కలిసొస్తుంది. ఆర్ధికంగా పరిస్థతి ఎంతో మెరుగుపడుతుంది. సౌత్ ఈస్ట్ లో లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బెడ్ రూమ్, ఆఫీస్ లలో ఉంచుకోవచ్చు. తూర్పు విభాగంలో లాఫింగ్ బుద్ధను ఉంచడం వల్ల కుటుంబానికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. మీ కుటుంబాన్ని వేధించే ఎన్నో సమస్యల్ని దూరం చేస్తుంది. పడమర విభాగంలో లాఫింగ్ బుద్ధను ఉంచితే వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది. మీ వెన్ను వెనుక జరిగే రకరకాల కుతంత్రాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

ఉత్తరంలో లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, ఆఫీసులలో ఉంచితే మీ కెరీర్ బాగుంటుంది. మీకు అదృష్టాన్ని సైతం అందిస్తుంది. లాఫింగ్ బుద్ధను మీకు అతితరుచుగా కనిపించే విధంగా ఎత్తయిన చోట అమర్చుకోడి. అంతే తప్ప భూమిపై ఉంచకండి. ఆఫీసులో అయితే... మీ ఆఫీసు టేబుల్ పైనే ఉంచుకోండి.

టాయిలెట్ లో, బాత్ రూమ్ లో లాఫింగ్ బుద్ధను ఉంచకూడదు. టాయిలెట్ కు ఎదురుగా కూడా లాఫింగ్ బుద్ధను ఉంచకూడదు. ఈ లాఫింగ్ బుద్ధ ప్రతిమను పవిత్రంగా భావించాలని పెంగ్ షుయ్ తెలియచేస్తుంది.

ప్రతిరోజూ ఒక్కసారైనా లాఫింగ్ బుద్ద టమ్మీని తప్పకుండా కుడిచేత్తో రబ్ చేయటం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి.

లాఫింగ్ బుద్ధను ప్రతిమలు పలురకాలున్నాయి. వాటి ఉపయోగం మాత్రం ఒక్కటే. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం.

చైనీస్ టార్టాయిస్


టార్టాయిస్ ను మీ ఇంటి వెనుక, మీ గార్డెన్ వెనుక, మీ ఆఫీస్ వెనుక భాగంలో ఉంచుకుంటే టార్టాయిస్ గార్డియన్ గా పనిచేసి మీకు మేలు చేస్తుంది.

మీ కెరీర్ ను మీ జీవితాన్ని స్మూత్ గా పెంచేందుకు బ్లాక్ టార్టాయిస్ నార్త్ భాగంలో ఉంచవచ్చు. ఫెంగ్ షుయ్ లో త్రీటర్ టిల్స్( అంటే ఒకదానిపై ఒక టార్టాయిన్ మొత్తం మూడు ఉంటాయి) అన్న బొమ్మ ఉంది. ఇది లాంగ్విటీకి సింబల్. బాత్ రూమ్ లో తప్ప ఇంట్లో ఎక్కడైనా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా హెల్త్ విభాగంలో ఉంచుకుంటే... దీర్ఘాయిషు లభిస్తుంది.

వెల్త్ టార్టాయిస్ గా పిలువబడే మరో రకం టార్టాయిస్ ఉంది. దీన్ని ఆఫీస్ లో కానీ, ఇంట్లో కానీ సౌత్ వెస్ట్ విభాగంలో ఉంచాలి. మెటల్ తో తయారు చేయబడిన టార్టాయిస్ ను ఒక బౌల్ లో నీరు ఉంచి ఆనీటిలో ఉంచి ఆ పాత్రను.... ఉత్తరంలో ఉంచితే చాలా మంచిది.

ఒకవేళ నార్త్ విభాగంలో మీ బెడ్ రూమ్ ఉంటే... నీళ్ళు లేకుండా కేవలం మెటల్ టార్టాయిస్ ను బెడ్ రూమ్ లో ఉంచుకోవచ్చు.

15, జులై 2010, గురువారం

సాలగ్రామము



సాలగ్రామము

సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వ్యావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. శంఖం అత్యంత పవిత్రమైనది. శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు. నీరు శంఖంలో పూరిస్తే తీర్థం అవుతుంది. వట్టివేళ్ళు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాలగ్రామాలకు పురుషుసూక్తం పఠిస్తూ అభిషేకం చేసిన తీర్థం సర్వశక్తివంతం. ఇటువంటి తీర్ధాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. తీర్ధాన్ని మూడుసార్లు తీసుకుంటారు. మొదటిది కాయసిద్ధి కొరకు, రెండవది ధర్మసాధనకు,మూడవది మోక్షం పొందడానికి. అసలీ తీర్ధం అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం కలుగుతాయి.

సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శవల్ల, అర్చనవల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. సాలగ్రామాలు శిలాజాలు. శాస్త్రజ్ఞులు ఈ శిలలను ఒక విధమైన ప్రాణి నిర్మిస్తుందని అంటారు. ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన మాధ్వులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు, ఇతవ వైష్ణవ గ్రంధాలు వీటిని గురించి సవిస్తరంగా వివరిస్తాయి.

నేపాల్ దేశంలో ఖట్మండుకు సుమారు 197 మైళ్ళు దూరంలో ముక్తినాధ్, గండకీ నదీ తీరంపై ఉన్న మహాషేత్రంలో ఇవి లభిస్తాయి. ఇవి సాధారణంగా స్థలజాలు, జలజాలు అని రెండు రకాలు. గండకీ నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న సాలగ్రామ గిరిపైన స్థలజాలు, గండకీ నదీ గర్భంలో జలజాలు లభిస్తాయి. సాలగ్రామాలలో బంగారం ఉంటుంది. అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా అంటారు. సాలగ్రామాలు అమోనైట్ శిలామాలు. ఇండియాలో ఈ సాలగ్రామాలు సముద్రంలో నివసించే టెథైస్ అనే ప్రాణి వల్ల ఏర్పడతాయి. ఇటువంటి శిలాజాలు అనేక రకాలు ఉన్నాయి. 250 మిలియన్ సంవత్సరాలలో ఇండియా ఉత్తర దిక్కుగా 9,000 కి.మీ. జరిగిపోయింది. హిమాలయాలు ఏర్పడ్డాయి. వీటి నుండి అనేక నదులు ప్రవహించాయి. ఇండో మైదానంలోకి ప్రవహించిన అటువంటి నదులలో ఒకటి గండకి. సాలగ్రామములు మన శాస్త్రం అనుసరించి కొన్ని సౌమ్యమైనవి. కొన్ని ఉగ్రమైనవి. శాస్త్ర సమ్మతంగా చక్రశుద్ధి, వక్త్రశుద్ధి, శిలాఉద్ధి, వర్ణశుద్ధి గల వాటినే పూజించాలి. రకరకాల రంగులు గలిగిన కారునలుపు, భగ్నమైన, మొక్కవోయిన సాలగ్రామాలను పూజించకూడదు. నారసింహ పాతాళ నారసింహ, గండభేరుండ, మహాజ్వాల మొదలైనవాటిని సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలి. విష్ణు, సీతారామ, గోపాల వంటి శాంతమూర్తులనే గృహస్థులు పూజించుకూవాలంటారు. పరిమాణాన్నిబట్టి కూడా పూజార్హతను నిర్ణయించుకుంటారు.. సాధారణంగా ఇవి ప్రతి గృహంలోనూ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. సాలగ్రామ శిలామహత్మ్యం గురించి వేరే చెప్పనక్కరలేదు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరునికీ, మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికీ అంతటి మహిమ ఉండడానికి కారణం అక్కడ ఉండే సాలగ్రామాలు అంటారు. సాలగ్రామాన్ని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దాని దానం వలన కూడా అంతటి ఫలం లభిస్తుంది.

రుధ్రాక్ష ధారణ అవగాహన



రుద్రాక్ష

ఆధ్యాత్మికతతో, ప్రేమపూరకమైన భక్తితో, భక్తి వైరాగ్యంతో నిండిపోయుండే భారతీయుడి హృదయానికీ, రుద్రాక్షకూ అవినాభావ సంబంధం ఉంది. ఈ సంబంధం భక్తుడికీ, భగవంతునికీ ఉన్న సంబంధంవంటిది. రుద్రాక్షను భగవంతునికి ప్రతిరూపంగా భావించే సంప్రదాయం ఆది కాలంనుండీ మనకు వస్తూనే ఉంది. ఇది కేవలం సంప్రదాయంగానే కాక అనేక విశ్వాసాలకు ప్రతిరూపంగా కూడా ఉండడంతో కుల మత ప్రమేయం లేకుండా వీటిని భారతీయులు ధరిస్తుంటారు. ఇవి అత్యంత శక్తివంతమైనవనీ, వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం తమపై పడదనే భావన ఉండడంతో వీటికి గిరాకీ ఎక్కువ. చాలా అరుదుగా లభించే రుద్రాక్షలంటే ఎవరైనా ఆరాటపడుతూనే వుంటారు. ఎక్కడ రుద్రాక్షల అమ్మకాలు జరుగుతున్నా వాటికోసం ఎగబడుతుంటారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులుపడుతున్నవారు, వ్యాపారపరంగా కలసిరానివాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారే కాక అద్భుత భవిష్యత్తును ఆశించేవారు కూడా ముందుచూపుగా ఈ రుద్రాక్షలను ధరిస్తుంటారు.

''స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్
భక్తానాం ధారణత్పాపం దివారాత్రికృతం హరేత్
లక్షం తు దర్శనాత్పుణ్యం కోటిస్తద్ధారణాద్భవేత్"


అని రుద్రాక్షమాల గురించి "జాబాలోపనిషత్"లో పేర్కొనబడింది. అంటే 'భక్తులను అనుగ్రహించేందుకు రుద్రాక్షలు స్థావరాలుగా అవతరించాయి. వీటిని ధరించినటువంటి భక్తులు ఏరోజు చేసిన పాపాలు ఆ రోజే నశిస్తాయి. రుద్రాక్షలను దర్శించడం వల్ల లక్ష జన్మల పుణ్యం, ధరించడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందీ అని అర్ధం.

రుద్రాక్ష చెట్టు "ఎలయో కార్పస్" వర్గానికి చెందినది. రుద్రాక్షలకు నేపాల్ పుట్టినిల్లు. నేపాల్‌లోని పంచక్రోశి సమీపంలోని రుద్రాక్షారణ్యంలో మొదటిసారిగా రుద్రాక్ష జన్మించినట్లు చెప్పబడుతూ ఉంది. సంహరించడంతో నేపాల్, బెంగాల్, అస్సాం, మధ్య ప్రదేశ్, ముంబై ప్రాంతాల్లో ఈ చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఈ చెట్టు 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పూలు తెల్లగా ఉండి ఆకులకన్నా చిన్నవిగా ఉంటాయి. ఈ చెట్టు ఫిబ్రవరిలో పూతకు వస్తుంది.

రుద్రాక్షకు ఆ పేరు ఎలా వచ్చింది?

రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో ఫోరాడి, మూడు పురములను భస్మం చేసినపుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటినుంచి నుంచి పుట్టినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్ధము. శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు. తంత్ర శాస్త్ర ప్రకారం రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవి.

"ధాత్రీఫలప్రమాణం యచ్చ్రేష్ఠమేతదుదాహృతం
బదరీఫలమాత్రం తు మధ్యమం ప్రోచ్యతే బుధై:
అధమం చణమాత్రం స్యాత్ప్రక్రియైష మయోచ్యతే"


అంటే ఉసిరిక కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా పేర్కొనబడుతున్నాయి. కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణమును కూడా గమనించాల్సివుంటుంది. రుద్రాక్షలు రకరకాల పరిమాణాల్లో ఉన్నట్లే రకరకలైన రంగుల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా తెలుపు, తేనె, నలుపు రంగులతోపాటు మిశ్రమ రంగుల్లో ఇవి లభ్యమవుతాయి. సాధారణంగా తేనె రంగులోని రుద్రాక్షలు ఎక్కువగా లభిస్తాయి.

రుద్రాక్షలలో వివిధ ముఖాలు కలిగినవి లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొనబడినప్పటికీ, పండితులు మాత్రం 21 ముఖాలు వున్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు. మొత్తం మీద పరిశీలిస్తే 14 ముఖాలున్న రుద్రాక్షలు మత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది. వాటి వివరాలు, ఉపయోగాలు :

1) ఏకముఖి రుద్రాక్ష : ఇది శివుని ప్రతిరూపం. ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి.

2) ద్విముఖి : అర్ధనారీస్వర తత్వానికి సంకేతం. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.

3) త్రిముఖి : ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.

4) చతుర్ముఖి : బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి. విద్యార్ధులకు బాగా ఉపకరిస్తుంది.

5) పంచముఖి : గుండె జబ్బులున్నవారికి మంచిది. శతృవులను సులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.

6) షణ్ముఖి : కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.

7) సప్తముఖి : కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించద

8) అష్టముఖి : విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.

9) నవముఖి : భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.

10) దశముఖి : జనార్ధనుడికి పరీక్ష. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.

11) ఏకాదశముఖి : 11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తులనుంచి కాపాడుతుంది.

12) ద్వాదశముఖి : 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది.

13) త్రయోదశముఖి : కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది.

14) చతుర్దశముఖి : 14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను.

15) పంచదశముఖి : పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.

16) షోడశముఖి : 16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.

17) సప్తదశముఖి : విశ్వకర్మకు ప్రతీక. దీని వలన సంపద కలుగుతుంది.

18) అష్టాదశముఖి : 18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.

19) ఏకోన్నవింశతిముఖి : 19 ముఖాలు. ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం.

20) వింశతిముఖి : 20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం.

21) ఏకవింశతిముఖి : 21 ముఖాలుగల రుద్రాక్ష. ఇది కుబేరునికి ప్రతీక. ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష. 21 ముఖాల కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్ర మాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమేదీ లేదు. జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయి.

రుద్రాక్షలు ధరించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వేటినిబడితే వాటిని ధరించకూడదు. ఎందుకంటే వీటిలో నకిలీవే ఎక్కువుంటాయి. ప్రజల మానసిక దౌర్బల్యాన్ని తమ స్వార్ధం కోసం వినియోగించుకునేవారే నేడు ఎక్కువ. నకిలీ రుద్రాక్షలనే అసలు రుద్రాక్షలుగా చిత్రీకరించి అమ్మే బూటకపు సిద్ధాంతులు, వ్యాపారస్తులపట్ల ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి.

నిజమైన రుద్రాక్షలను గుర్తించడానికి కొన్ని పద్ధతులున్నాయి. అవి:

1) ఏకముఖి రుద్రాక్షలు ప్లాస్టిక్ లో వస్తాయి జాగ్రత్త వహించాలి.

2)ఏకముఖి రుద్రాక్షలు కెమికల్స్ తో కూడ వస్తాయి జాగ్రత్త వహించాలి.

3)"7"ముఖాల రుద్రాక్ష దగ్గర నుండి పెద్ద ముఖాల రుధ్రాక్షలు గీతలు చెక్కుతారు గమనించాలి.

4)రుధ్రాక్షకు ఏటువంటి పరీక్షలు గాని ఉండవు అనుభవంతో మాత్రమే గమనించాలి.

పై పరీక్షలను చేయడం ద్వారా నిజమైన రుద్రాక్షను నిర్ధారించడం ఉత్తమం.

రుద్రాక్ష ధారణా నియమాలు :




సరైన రూపంలో లేని రుద్రాక్షలను, ముల్లులేని రుద్రాక్షలను, పురుగులు తిన్న, పాడైపోయిన రుద్రాక్షలను ధరించరాదు. వీటిని అన్ని జాతుల, కులాలవారు ధరించవచ్చు. వీటిని బంగారం, వెండి, రాగి తీగెలతోగానీ, సిల్కు దారముతోగూర్చిగానీ ధరించాలి. రుద్రాక్ష్లను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి.



సంభోగ సమయంలో వీటిని ధరించకూడదు. ఒకవేళ ఆ సమయంలో పొరపాటున ధరించిన యెడల తరువాత వాటిని ఆవు పాలతో శుద్ధి చేయాలి. రుద్రాక్షను ధరించేముందు "ఓం నమశ్శివాయ" శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి.



సంవత్సరానికి ఒక్కసారైనా మాలకు 'మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం' చేయడం మంచిది. వీలైనంత వరకు శివరాత్రి చేయడం మంచిది. రుద్రాక్షలు ధరించిన వారు ధూమపానం, మద్యపానం చేయరాదు. వెల్లుల్లి, మాంసాహారమును మానివేయడం మంచిది.

వివిధ రకాలైన సమస్యలతో బాధపడేవారు, వివిధ నక్షత్రాలు, రాసులవారు పండితుల సలహా మేరకు ఆయా ముఖాల రుద్రాక్షలను ధరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఇవి వివిధ వ్యాధులను నయం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ప్రధానంగా రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, మూర్చ, జలుబు, గొంతు వాపు అజీర్ణం, శ్వాసకోశ వ్యాధులు మొదలైన వ్యాధులకు రుద్రాక్ష ఉపయోగపడుతుంది.

భారతీయ ఆధ్యాత్మిక సంపదలో భాగమైన రుద్రాక్షలు ధరిస్తే పునర్జన్మ ఉండదని భారతీయులు విశ్వసిస్తారు. ఆత్మ నిగ్రహానికీ, ఆత్మ సౌందర్యానికీ, మానసిక ప్రశాంతతకూ శక్తి వాహకాలైన వీటి ధారణ యోగ శక్తి పెంపొందించుకునేందుకూ, నిర్మలమైన, నిశ్చలమైన జీవితాన్ని సాగించేందుకూ తోడ్పడుతాయి.

ఆదిత్య హృదయం



ఆదిత్య హృదయం

స్తోత్రం

తతో యుద్దపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్‌,
రావణం చాగ్రతో దృష్వా యుద్దాయ సముపస్థితమ్‌.

దైవతై శ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్‌,
ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి:.
***
రామ! రామ! మహా్బాహొ ! శృణు గుహ్యం సనాతనమ్‌,
యేన సర్వా నరీన్‌ వత్స! సమరే విజయిష్యసి.

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్‌,
జయావహం జపే న్నిత్యం అక్షయ్యం పరమం శివమ్‌.

సర్వమంగళ మాంగల్యం సర్వపాపప్రణాశనమ్‌,
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమమ్‌.
***
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్‌,
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్‌.

సర్వ దేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావన:,
ఏష దేవాసురగణాన్‌ లోకాన్‌ పాతి గభస్తిభి:.

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ: స్కంద: ప్రజాపతి:,
మహేంద్రో ధనద: కాలో యమ: సోమో హ్యపాంపతి:.

పితరో వసవ: సాధ్యా హ్యశ్వినౌ మరుతో మను:,
వాయు ర్వహ్ని:ప్రజా:ప్రాణా: ఋతుకర్తా ప్రభాకర:.

ఆదిత్యా: సవితా సూర్య: ఖగ: పూషా గభస్తిమాన్‌,
సువర్ణసదృశో భాను: స్వర్ణ్యరేతా దివాకర:.

హరిదశ్వ: సహస్రార్చి: సప్త్సప్తి: మరీచిమాన్‌,
తిమిరోన్మధన: శంభు స్త్వష్టా మార్తాండకోంశు మాన్‌.

హిరణ్యగర్భ: శిశిర స్తపనో భాస్కరో రవి:,
అగ్నిగర్భో దితే: పుత్ర: శంఖ: శిశిరనాశన:.

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుస్సామ పారగ:,
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవీథీ ప్లవంగమ:.

ఆతపీ మండలీ మృత్యు: పింగళ: సర్వతాపన:,
క(ర)వి ర్విశ్వో మహాతేజా రక్త: సర్వభవోద్భవ:.

నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వభావన:,
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్‌! నమో స్తుతే.
* * *

నమ: పూర్వాయ గిరయే పశ్చిమాద్రయే నమ:,
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ:.

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ:,
నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ:.

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ:,
నమ: పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమ:.

బ్రహ్మేశా నాచ్యుతేశాయ సూర్యా యాదిత్యవర్చసే,
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ:.

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే,
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ:.

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే,
నమస్తమో భినిఘ్నాయ రవయే లోకసాక్షిణే.
* * *

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభు:,
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి:.

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టిత:,
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చై వాగ్నిహోత్రిణామ్‌.

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ,
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి: ప్రభు:.

ఏన మాపత్సు కృచ్చే షు కాంతారేషు భయేషు చ,
కీర్తయన్‌ పురుష: కశ్చి న్నావసీదతి రాఘవ!

పూజయ స్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్‌,
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి.

అస్మిన్‌ క్షణే మహాబాహో! రావణం త్వం వధిష్యసి,
ఏవ ముక్త్వా తతో గస్త్యో జగామ చ యథాగతమ్‌.

ఏతచ్చు త్వా మహాతేజా నష్టశోకో భవత్తదా,
ధారయామాస సుప్రీతో రాఘవ: ప్రయతాత్మవాన్‌.

ఆదిత్యం ప్రేక్ష్యం జప్త్వేదం పరం హర్ష మవాప్తవాన్‌,
త్రిరాచమ్య శుచి ర్భూత్మా ధను రాదాయ వీర్యవాన్‌.

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమత్ ,
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్.

అథ రవి రవద న్నిరీక్ష్య రామం
ముదితమనా: పరమం ప్రహృష్యమాణ:
నిశి చరపతి సంక్షయం విదిత్వా
సురగణ మధ్యగతో వచ స్త్వ రేతి.

ఓం తత్ సత్
* * *

హనుమాన్ చాలీస



హనుమాన్ చాలీస


దోహా
శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫల చారీ
బుద్ధిహీన తను జానీకే సుమిరౌఁ పవన కుమార్
బల బుధి విద్యా దేహుమొహి హరహు కలేశ వికార్


చౌపాయి

జయ హనుమాన జ్ఞాన గుణసాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర |1 |

రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా | 2|

మహవీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతికే సంగీ | 3|

కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచిత కేశా | 4|

హాథ వజ్ర ఔ ధ్వజావిరాజై
కాంధే మూంజ జనేవూసాజై | 5|

శంకర సువన కేసరీ నందన
తేజ ప్రతాప మహాజగ వందన | 6|

విద్యావాన గుణీ అతి చాతుర
రామకాజ కరివేకో ఆతుర |7 |

ప్రభు చరిత్ర సునివేకో రసియా
రామ లఖన సీతా మన బసియా |8 |

సూక్ష్మ రూప ధరి సియహిఁదిఖావా
వికట రూప ధరి లంక జరావా |9 |

భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్రకే కాజ సఁవారే |10 |

లాయ సజీవన లఖన జియాయే
శ్రీ రఘువీర హరషి ఉరలాయే |11 |

రఘుపతి కీన్హీ బహుత బడాయీ
తుమ్మమ ప్రియ భరతహి సమ భాయీ |12 |

సహస వదన తుమ్హరో యశగావైఁ
అస కహి శ్రీపతి కంఠ లగావై |13|

సనకాదిక బ్రహ్మది మునీశా
నారదా శారద సహిత అహీశా |14 |

యమ కుబేరా దిగపాల జహాఁతే
కవి కోవిద కహి సకే కహాఁతే |15 |

తుమ ఉపకార సుగ్రీవహిఁకీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా |16 |

తుమ్హరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా | 17|

యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో త్యాహి మధుర ఫల జానూ |18 |

పభు ముద్రికా మేలి ముఖ మాహీఁ
జలిధిలాఁఘి గయే అచరజ నాహీ |19 |

దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే |20 |

రామ దుఆరే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే |21 |

సబ సుఖులహై తుమ్హారీ శరనా
తుమ రక్షక కాహూకో డరనా |22 |

ఆపన తేజ సమ్హారో ఆపై
తీనోఁ లోక హాంకతే కాంపై |23|

భూత పిశాచ నికట నహిఁ ఆవై
మహావీర జబ నామ సునావై |24 |

నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా |25 |

సంకట తేఁ హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై |26 |

సబ పర రామ తపస్వీ రాజా
తినకే కాజ సకల తుమ సాజా |27 |

ఔర మనోరధ జో కోయి లావై
తాసు అమిత జీవన ఫల పావై |28 |

చారోఁ యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా |29 |

సాధు సంతకే తుమ రఖవారే
అసుర నికందన రామదులారే | 30|

అష్టసిద్ది నౌనిధి కే దాతా
అస వర దీనహి జానకీ మాతా |31|

రామ రసాయన తుమ్హారే పాసా
సదా రహో రఘుపతికే దాసా |32 |

తుమ్హారే భజన రామకోపావై
జన్మ జన్మకే దుఃఖ బిసరావై |33 |

అంతకాల రఘువరపుర జాయీ
జహాఁ జన్మ హరిభక్త కహాయీ |34 |

ఔర దేవతా చిత్తన ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ |35 |

సంకట హటై మిటై సబ పీరా
జోసుమిరై హనుమత బలవీరా |36 |

జైజైజై హనుమాన్ గోసాయీఁ
కృపాకరో గురుదేవకీ నాయీ |37 |

యహ శతవార పాఠకర్ కోయీ
ఛూటహిబంది మహా సుఖహోయీ |38 |

జో యహ పడై హనుమాన్ చాలీసా
హోయ సిద్ది సాఖీ గౌరీసా|39|

తులసీదాస సదా హరి చేరా|
కీజై నాథ హృదయ మహఁడేరా|40|


దోహ:

పవన తనయ సంకట హరన మంగళ
మూరతి రూప్ రామలఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్(తులసీదాసు)
శ్లో: రామాయ, రామచంద్రాయ రామభద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

శ్రీ రాజా రామచంద్రకీ జై
హనుమాన్ చాలీసా సంపూర్ణము

8, జులై 2010, గురువారం

సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు



ధనం, శాంతి , కోరికలు, విజయాలను సిద్దింపజేయటానికి రుద్రాక్ష ధారణ ఉత్తమ మార్గమని శివ పురాణం చెపుతోంది. ఈ రుద్రాక్షల్లో ప్రధానంగా నాలుగు రకాలున్నాయి. మొదటిది రుద్రాక్ష, రెండోది భద్రాక్ష, మూడోది సాద్రాక్ష, నాలుగోది రౌద్రాక్ష. వీటిలో ఒక ముఖం నుండి 14 ముఖాలు కలిగినవి సాధారణంగా ఉంటాయి. అయితే అంతకన్నా ఎక్కువ ముఖాలు కలిగినవి కూడా ఉండవచ్చు. రుద్రాక్ష ముఖాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి.

ఏకముఖి రుద్రాక్షను చూడటం వల్లే పాపాలు నశించి లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది.
ద్విముఖిని ధరిస్తే పాపనాశనం కలిగి కోరికలు నెరవేరతాయి.
త్రిముఖి రుద్రాక్షను పూజించినా ధరించిన సర్వ కార్యాలు సిద్దిస్తాయి.
చతుర్ముఖి రుద్రాక్షను తాకినా చూసినా సకల పాపాలు నశిస్తాయి.
పంచముఖిని ధరిస్తే పాపనాశనం జరిగి మోక్షం కలుగుతుంది.
షణ్ముఖి రుద్రాక్షను కుడి భుజాన ధరిస్తే సర్వ పాపాలు నశించి శుభం చేకూరుతుంది.
సప్తముఖి ధరిస్తే దరిద్రం నశించి ధనవంతులవుతారు.
అష్ట ముఖి రుద్రాక్షను ధరించటం వల్ల దీర్ఘాయుష్కులవుతారు.
నవముఖి రుద్రాక్ష నవ దుర్గ రూపి. ఎడమ చేతిన ధరిస్తే శివతుల్యత్వం వస్తుంది.
దశముఖి రుద్రాక్షను ధరించినవారికి సకల కోరికలు నెరవేరతాయి.
ఏకాదశముఖి రుద్రాక్ష వల్ల అనుకున్నవి అన్నీ నెరవేరతాయి.
ద్వాదశ ముఖి రుద్రాక్షను ధరించటం వల్ల తేజస్సు కలుగుతుంది.
త్రయోదశముఖి, చతుర్థముఖి రుద్రాక్షల వల్ల సకల కోరికలు నెరవేరతాయి.
ఇక రుద్రాక్షలున్న మాలతో జపం చేసే వారికి మాలలో రుద్రాక్ష సంఖ్యను బట్టి ఫలితాలు చేకూరతాయి.

25 రుద్రాక్షలున్న జపమాలతో జపం చేస్తే ముక్తి వస్తుంది.
27 రుద్రాక్షలున్న జపమాలతో జపం చేసిన వారికి పుష్టి కలుగుతుంది.
54 రుద్రాక్షలున్న జపం చేస్తే హృదయానికి మంచిది.
108 రుద్రాక్షలు గల జపమాలతో జపం చేస్తే అనుకున్నవన్నీ జరుగుతాయి.
రుద్రాక్షను మెడలోగానీ, చేతికి గానీ , నడుముకు గానీ కట్టుకోవాలి. పిల్లలకు ధరింప చేస్తే బాలారిష్ట దోషాలు పోవటమే కాక అనారోగ్యాలు పోయి ఆరోగ్యవంతులవుతారు.

క్రిష్టల్ బాల్



ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం స్పటికాన్ని (క్రిస్టల్) నైరుతి దిశలో ఉంచితే ఆ కుటుంబ సంబంధాలు మెరుగవడంతో పాటు పెళ్ళికాని వారికి వివాహం కుదరడం జరుగుతుంది. అలాగే ఈ స్పటికాలను ఈశాన్య దిశలో వేలాడ దీయడం ద్వారా మీ పిల్లలు అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తారు.

ఉదయాన్నే స్పటికాన్ని ఈశాన్య గదిలోని ఈశాన్య మూలలో ఉంచి, ఐదు నిమిషాల పాటు లేత సూర్య కిరణాలు దానిపై పడేట్లు చేయాలి. ఇలా చేసిన తర్వాత క్రిస్టల్‌లోనికి చూస్తూ... మనకు కావాల్సిన కోరికకు సంబంధించిన దృశ్యాన్ని ఊహించుకున్నట్లైతే ఆ కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

ఇలా స్పటికంలోకి చూస్తూ... మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించుకుంటే కూడా శుభప్రదమని ఫెంగ్‌షుయ్ శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా... పదే పదే స్పటికం ముందు అనుకున్న దృశ్యాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా ఆ ఆలోచనల తాలూకు తరంగాలు స్పటికంలోనే ఉండి పోతాయి. తిరిగి అందులోనూ ఆ తరంగాలు కొనసాగుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఆ కోరికను జరగాల్సిన కోణంతోనే మనల్ని నిర్దేశిస్తాయని నిపుణుల నమ్మకం.

అలా దృశ్యాన్ని నిక్షిప్త పరచిన క్రిస్టల్‌ను నైఋతి దిశలోని గదిలో నైఋతి మూలలోగానీ, బెడ్‌రూంలోని నైఋతి దిశలో గానీ వేలాడదీస్తే... కుటుంబ సఖ్యతను సాధించవచ్చు. అదే విధంగా ఇంట్లో పెళ్ళి కాని వారి గదిలోని నైఋతి దిశలో ఈ స్పటికాన్ని వేలాడదీస్తే త్వరలో వివాహ సంబంధాలు కుదురుతాయని ఫెంగ్‌షుయ్ శాస్త్ర నిపుణులు అంటున్నారు.

నవగ్రహాల శాంతికి ఎలాంటి వస్తువులు దానం చేయాలంటే?



నవగ్రహాల ఆధిపత్యంలో కష్టసుఖాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కానీ నవగ్రహాలను శాంతి పరచడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం ఆయా గ్రహాధిపత్యంలో పుట్టిన జాతకులు తమ గ్రహాధిపత్య సంచారాన్ని అనుసరించి పూజ, దానం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.

నవగ్రహ శాంతికి సంబంధించి జాతక ప్రకారం పూజాది కార్యక్రమాలు చేయాలనుకునేవారు నవగ్రహాలకు ప్రీతికరమైన వస్తువులతో పూజ, దానాది కార్యక్రమాలను నిర్వహించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నవగ్రహ పూజలో భాగంగా గ్రహ శాంతికి, దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

సూర్యగ్రహ శాంతి కోసం పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. ఈ జాతకులు చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురు గ్రహానికి పూజ నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల వీరికి అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు.
చంద్రగ్రహ శాంతి కోసం చంద్రుణ్ణి పూజించి బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది.

కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు బాధ తొలగుతుంది.

బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చ ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.

శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. వజ్రం, పగడము ధరించిటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.
రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక దైవశక్తి పెరుగుతుంది. శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతరత్రా కష్టాలు తొలగిపోతాయి.

మీ అమ్మాయికి, లేదా అబ్బాయికి పెళ్లి సంబంధం కుదరలేదా? అయితే మీ పిల్లల బెడ్‌రూమ్‌లో హృదయాకారంలో ఉన్న రెండు పింక్ క్రిస్టల్స్‌ ఉంచడం శ్రేయస్కరమని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇలా ఉంచినట్లయితే, వారికి మంచి పెళ్లి సంబంధాలు రావడం, పెళ్లి కుదరడం జరుగుతుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.

అదేవిధంగా... క్రిస్టల్ గ్లోబ్‌ను పిల్లల టేబుల్ మీద ఈశాన్యంలో ఉంచడం ద్వారా మీ పిల్లల విద్యా, జ్ఞాపక శక్తి బాగా అభివృద్ధి చెందుతుంది. క్రిస్టల్‌ గ్లోబును మీ టేబుల్ మీద ఈశాన్యంలో ఉంచి, ప్రతిరోజూ మూడుసార్లు ఆ గ్లోబును తిప్పినట్లైతే, మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది.

ఇకపోతే.. నిజమైన క్రిస్టల్‌తో చేసిన ఓ వస్తువైనా అంటే... క్రిస్టల్ చెట్టు, క్రిస్టల్ పేపర్ వెయిట్, క్రిస్టల్ గ్లోబ్ వంటి వస్తువులను మీరు వాడే టేబుల్‌ ఎడమచేతివైపు ఉంచడం ద్వారా కెరీర్‌‌లో అభివృద్ధి చెందుతారని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

ఇదిలా ఉండగా.. భూమి నుంచి తీసిన రియల్ క్రిస్టల్ రాయిని వాస్తు దోషమున్న చోట పెట్టడం ద్వారా ఆ దోషము తొలగిపోవునని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.

హాలులో "ఫోనిక్స్" చిత్రాన్ని తగిలించండి



మీరు వ్యాపారంలో దెబ్బతిని తిరిగి సదవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఫోనిక్స్ చిత్రాన్ని మీ హాల్లో దక్షిణం వైపు తగిలిస్తే శుభ ఫలితాలుంటాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

ఇంకా మీ అమ్మాయి/అబ్బాయికి మంచి సంబంధం కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు కూడా ఫోనిక్స్ చిత్రాన్ని పైవిధంగా ఇంట్లో తగిలిస్తే మంచి సంబంధాలు కుదురుతాయని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

ఈ ఫోనిక్స్ చిత్రాన్ని ఇంట్లో తగిలించడం ద్వారా ఇతరుల నుంచి రావాల్సిన ధనం, సదవకాశాలు వెల్లువల్లా వెత్తుక్కుంటూ వస్తాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. కేవలం ఇంటి గోడ మీద ఉంచడమే గాకుండా ఫోనిక్స్ పక్షి డిజైన్ ఫన్న షర్టులను, లుంగీలను సైతం వాడితే అదృష్టం మీ వెన్నంటి ఉంటుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

పాదరస శివలింగం



దక్షిణ భారతదేశంలోని పలు సుప్రసిద్ధ ఆలయాల్లో పాదరసంతో తయారించిన శివలింగాలు విక్రయించబడుతున్నాయి. పాదరసంతో తయారు చేయబడిన లింగాలను ఇంటి పూజామందిరములో ఉంచి పూజలు చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

పాదరసంతో తయారు శివలింగాలు మాత్రమే కాకుండా ఇతర దేవత విగ్రహాలను ఇంటిలో ఉంచి పూజలు చేయడం ద్వారా ఆయుర్ధాయం, విద్య, వివాహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా పాదరసంతో కూడిన విగ్రహాల నుంచి వెలువడే శక్తి దుష్టశక్తులను ఇంటి నుంచి తరిమికొడుతుందని విశ్వాసం. అయితే పూర్వం మంత్రతంత్రాలకు పాదరసాన్ని ఉపయోగించేవారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కానీ పాదరసం తయారైన విగ్రహాలను పూజించడం ద్వారా దుష్ట శక్తుల నుంచి కలిగే అశుభ ఫలితాలు దరిచేరవని విశ్వాసం.

ఇకపోతే.. పాదరసంతో రూపొందిన శివలింగానికి అభిషేకం చేయించిన పాలు, తేనె, కొబ్బరి నీళ్లను సేవించడం ద్వారా శరీరంలోని నరాలకు మంచిదని పురోహితులు చెబుతున్నారు. అలాగే కామసంబంధిత వ్యాధులను దూరమవుతాయి. ఇంకా పాదరసంతో కూడిన లింగాలను, ప్రతిమలను పూజించడంతో పాటు పాదరసంతో తయారు చేసిన ఉంగరాలు, చెవిపోగులు వంటివి ధరించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే జ్యోతిష్యం ప్రకారం పాదరసం బుధగ్రహ నక్షత్రానికి తగినదంటున్నారు. అందుచేత బుధగ్రహాధిపత్యంలో జన్మించిన జాతకులు ముత్యం వంటి అరుదైన వస్తువులతో చేయబడిన పాదరస లింగాలను, విగ్రహాలను పూజించడం ద్వారా ఉపాధి అవకాశాలు, విదేశీయానం, ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

29, ఏప్రిల్ 2010, గురువారం

విధ్యా ప్రాప్తి యంత్ర పిరమిడ్


విధ్యా ప్రాప్తి యంత్ర పిరమిడ్;-ఈ పిరమిడ్ లోపల చదువు కొనే వ్యక్తుల లేదా విద్యా వ్యాపారాలకు సంబందించిన వ్యక్తుల లేదా పరిశోదన చేసేవారు మరియు విద్యా భోధన చేసేవారు మరియు విద్యలో ఆటంకాలు కలుగుతున్న వారు పోటీ పరీక్షలలో విజయం కోరుకొనేవారు మరియు వ్యాపార,ఉధ్యోగాలలో మెళుకువలు తెలుసుకోవాలనే కోరిక కలిగిన వారు వారి యొక్క కలర్ పోటో గాని,బ్లాక్ &వైట్ పోటో గాని తీసుకొని పోటోలోని బొమ్మ వైపును యంత్రానికి ఆనించి ఉంచి పిరమిడ్ క్యాప్ తో మూసివేసి కనీసం 45 రోజులపాటు ఏవారు కదిలించని సురక్షిత ప్రదేశంలో ఉంచిన ఆపోటో లోని వ్యక్తులకు పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది.ఈ విధంగా చేయటం వలన విధ్యార్దులలో తనంతట తాను చదువుకొవాలనే ఆసక్తి కలుగుతుంది.ఙ్ఞాపక శక్తితో పాటు పోటీతత్వంతో చదువుతారు .పరిశోదకులకు పరిశోదనా సామర్ద్యం పెరుగుతుంది.ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపార సంస్దలలోకి వచ్చిన కస్టమర్సును ఆకర్షించే విధంగా వాక్ శుద్ధి కలిగిస్తుంది.ఈ పిరమిడ్ అందరికి ఆలోచనని ,ఙ్ఞానాన్ని కలిగిస్తుంది .

28, ఏప్రిల్ 2010, బుధవారం

బ్యాంబు ట్రీ


బ్యాంబు ట్రీ:-(చైనా వెదురు చెట్టు);-ఇది మన నవగ్రహాలలో బుథ గ్రహానికి చెందినది.ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృథ్ధి చెందుతుంది.(చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది.వ్యాపార సంస్థలలో నరథిష్టికి ' ఆకర్షణకు ,వ్యాపారభివృథ్థికి చాలా మంచిది .

పిల్లలు చధువు కొనే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు ,చదువుపై శ్రద్ద ,సరియైన సమయంలో (పరీక్ష సమయములలో ) గుర్తుకు వచ్చే ఆలోచనలు(క్రియేటివిటి) .మంచి వాక్ ఫటిమ కలిగి భావ ప్రకటన చేయగలడు.

ఇంటిలో సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వీథిపోటు ,నరదృష్టి ,కనుదృష్టి,చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించి మంచి అన్యోన్నత ,ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడు సుఖశాంతులు ,థనాభివృద్దితో ఇల్లు కళకళ లాడుతుంది .

వాహాన నియంత్రణ పిరమిడ్


వాహాన నియంత్రణ పిరమిడ్:ఈ పిరమిడ్ అన్ని వాహానాలలో ఉపయోగించుకొనవచ్చును.పిరమిడ్ లోపల ఉన్న యంత్రం మీద వాహానాన్ని నడుపుతున్న వ్యక్తి యొక్క లేదా వాహానం యొక్క ఓనర్ లేదా వారి ప్యామిలికి చెందిన కలర్ పోటో గాని ,బ్లాక్ &వైట్ పోటోగాని తీసుకొని పోటోలోని బోమ్మ వైపును యంత్రానికి ఆనించి ఉంచి పై పిరమిడ్ క్యాప్ తో మూసివేసి కనీసం 45రోజుల పాటు ఉంచిన పోటోలోని వ్యక్తులకు ఎనర్జీ వస్తుంది.ఆ వ్యక్తులు వాహానం నడిపేటప్పుడు మంచి ఏకాగ్రతతో వాహానం నడప గలరు.అంతేకాక వాహానానికి యాక్సిడెంట్సు కాకుండా కాపాడుతుంది.ఇంకా వాహానానికి ఎక్కువ రిపేర్లు రాకుండా కాపాడుతుంది.ఈ వాహాన నియంత్రణ పిరమిడ్ ఎళ్ళవేళల వాహానానికి రక్షణ కవచం లాగ పనిచేస్తుంది .

శుక్ర దోష నివారణా క్షేత్రం "తిరునావలీశ్వరాలయం


తిరునావలూరులోని తిరునావలీశ్వర ఆలయం ప్రముఖ శుక్రదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శుక్రుడంతటి వాడికే శాప విమోచనం కలిగించిన క్షేత్రంగా విశ్వసించటంతో ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది.

విల్లుపురం జిల్లాలోని తిరునావలూరులో నెలకొన్న ఈ ఆలయానికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది.

మొదటి పరాంతక చోళుడి కుమారుడు రాజ ఆదిత్యన్ ఈ తిరునావలీశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలోని మూల విరాట్టుకు భక్త జనేశ్వరుడు, తిరునావలీశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి. తమిళంలో తిరు అనేది తెలుగు శ్రీ అనే పదానికి సమానార్థకం కాగా.. నావల్ అంటే నేరేడు చెట్లు అని అర్థం.

ఈ ఆలయ ప్రాంగణంలో నేరేడు చెట్లు అధికంగా ఉండటంతో ఆ ప్రాంతానికి తిరునావలూరు అనే పేరు వచ్చినట్లు, ఊరి పేరు ప్రకారమే స్వామివారికి తిరునావలీశ్వరుడుగా పిల్చుకుంటున్నట్లు ప్రతీతి. ఆలయ స్థల వృక్షం కూడా నేరేడు చెట్టే కాగా... అమ్మవారిని సుందరనాయకి, మనోన్మణి అనే పేర్లతో భక్తులు పిలుస్తుంటారు.

మూల విరాట్టుపై సూర్య కిరణాలు:
ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఆలయ మూల విరాట్టుపై సూర్య కిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. ఈ సుందర దృశ్యం చూసేందుకు ఆ రోజు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటుంటారు.

ఆలయ ప్రాశస్త్యం విషయానికి వస్తే... ఒకానొక సందర్భంలో మునీశ్వరుల శాపానికి గురైన శుక్రుడు తిరునావలీశ్వర ఆలయంలోని స్వామివారిని పూజించి విమోచనం పొందినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆలయం శుక్రదోష విమోచన క్షేత్రంగా విలసిల్లుతోంది. శుక్ర దోషం ఉన్నవారు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

63 మంది నయనార్లలో ఒకరైన సుందరర్ జన్మస్థలం కూడా తిరునావలూరే కావడంతో, ఆలయం ఎదురుగా ఆయనకు ఒక ప్రత్యేక సన్నిధిని నెలకొల్పారు. అప్పట్లోనే ఈ ఆలయ ప్రాశస్త్యం శ్రీలంక వరకు వ్యాప్తి చెందడంతో, అక్కడి తమిళ రాజులు తిరునావలీశ్వర ఆలయానికి విరాళాలు కూడా అందజేసినట్లు శాసనాలు చెబుతున్నాయి.

ఈ ఆలయంలో మూడుపూటలా నిత్య పూజలను నిర్వహిస్తుంటారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి, రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరువబడి ఉంటుంది. నెలలో రెండు రోజులు ప్రదోష పూజలు.. మంగళ, శుక్ర వారాలలో అమ్మవారికి విశేష పూజలు.. ఏడాదిలో మహాశివరాత్రి లాంటి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో నవగ్రహ సన్నిధి, భైరవుడు, గురు దక్షిణామూర్తి, నయనార్లు, అమ్మవారి సన్నిధులు వేరువేరుగా ఉన్నాయి.

ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఆలయ మూల విరాట్టుపై సూర్య కిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. ఈ సుందర దృశ్యం చూసేందుకు ఆ రోజు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటుంటారు. సాధారణంగా ఆలయాల్లో గురు దక్షిణామూర్తి స్వామివారు కూర్చున్న భంగిమలో కనిపిస్తాడు. కానీ ఈ ఆలయంలో మాత్రం నిలబడిన భంగిమలో, వృషభంపై ఓ చేయి వేసి కనిపిస్తూ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఎలా వెళ్లాలంటే... తమిళనాడులోని చెన్నై నగరం నుంచి వెళ్లే భక్తులు బన్రుట్టి, విళుపురం నుంచి బస్సు మార్గంలో తిరునావలూరు వెళ్లవచ్చు. చెన్నై-తిరుచ్చి మార్గంలో సుమారు 200 కిలోమీటర్ల దూరంలోను... బన్రుట్టి నుంచి 18 కిలో మీటర్ల దూరంలోను, విళుపురం నుంచి 22 కిలోమీటర్ల దూరంలోను తిరునావలూరు ఉంటుంది.

27, ఏప్రిల్ 2010, మంగళవారం

25, ఏప్రిల్ 2010, ఆదివారం

ఉమా కోటిలింగేశ్వర స్వామి




దక్షిణ కాశీగా పిలవబడుతూ, భక్తుల చేత నిత్యపూజలందుకుంటున్న ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంతం

లో పూర్వం... ఋషులు తపస్సు చేసి, ఆ పరమశివుడి సాక్షాత్కారం పొందారట. అందుకే ఇక్కడ శివయ్య లింగరూపంలో వెలశాడని పూర్వీకుల కథనం.

చుట్టూ ఎత్తైన కొండలు, వాటి మధ్యలో జలపాతాల హోరు, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ఆ కొండలపై వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి, వెరసి భక్తుల మదిని పులకింపజేసేదే "పుణ్యగిరి" దేవాలయం. ఇక్కడ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలూ వైదొలగుతాయని భక్త జనులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు.

పుణ్యగిరి గురించి మరో కథనం కూడా ఉంది. అదేంటంటే... మహా భారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో, పుణ్యగిరి కొండపై గల విరాటరాజు కోటలో తలదాచుకున్నారట. ఆ సమయంలో వారు ఇక్కడ పుట్టద్వారా వచ్చే పుణ్యజలంతో స్నానమాచరించి శివుడిని పూజించేవారట.

కాబట్టి... ఇంతటి పవిత్ర స్థలంలో స్నానమాచరించి ఆ పరమశివుడిని దర్శించుకుంటే సర్వపాపాలూ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి పర్వదినాన పుణ్యగిరిలో జాగారం చేసి, ఉమా కోటిలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే నేరుగా కైలాసం ప్రాప్తిస్తుందని భక్త జనులు గట్టిగా నమ్ముతుంటారు.

ఉమా కోటిలింగేశ్వర ఆలయం వెలసిన ప్రాంతంలో కోటిలింగాలు, త్రినాథ గుహ, దార గంగమ్మ పుణ్య జలపాతాలను విశేషంగా చెప్పవచ్చు. అంతేగాకుండా... ఆలయం చుట్టూ ఎత్తయిన కొండలు, మధ్యలో జలపాతాల హోరు, అడుగడుగునా కనిపించే పచ్చగా పరచుకున్న ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

హిందూ సంప్రదాయ పండుగలతో పాటు శివరాత్రి పర్వదినాన్ని పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శివరాత్రికి తొమ్మిదిరోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. మొదటి మూడు రోజుల ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

ఈ ఉత్సవాలకు ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. శివరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు.

వసతి, రవాణా సౌకర్యాల విషయానికి వస్తే... విశాఖపట్నం-అరకు మధ్యలో నెలవై ఉన్న ఈ పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి ముఖ్యమైన అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బస్సులో వెళ్లి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది. నడవలేనివారు బస్టాండు నుంచి ఆటోలలో కూడా వెళ్ళవచ్చు.

పుణ్యక్షేత్రం అరసవల్లి


"ఆదిత్యుడి" పాదాలను స్పృశించే సూర్యకిరణాలు

ఉషోదయ కిరణాలతో సమస్త ప్రాణ కోటికి నూతన చైతన్యాన్ని నింపుతున్న సూర్యభగవానుడు ఆదిత్యునిగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం అరసవల్లి. ఈ ఆలయంలో కొలువుదీరిన భాస్కర స్వామిని పూజించిన వారికి ఈతిబాధలు, సర్వదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

ఈ ఊరిని తొలుత "హర్షవల్లి" అనే వారని అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. శ్రీ ఉషా, పద్మినీ, ఛాయాదేవి సమేతుడైన సూర్యనారాయణుడు సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం.

రెండు చేతుల్లో అభయ ముద్రలను కలిగియుండే సూర్యనారాయణుడు, నడుముకు చురిక(కత్తి)తో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక గరుత్మంతుడి అన్న అయిన అనూరుడు (అంటే తొడలు లేని వాడు అని అర్ధం) సూర్యనారాయణుని రథానికి సారథిగా ఉంటాడు. అనూరుడికే అరుణుడనే మరో పేరుంది. స్వామి విగ్రహానికి ఇరు పక్కలా చత్రచామరాలతో సేవచేస్తున్న సనకసనందులు ఉంటారు.

"మహాభాస్కర క్షేత్రం"గా పిలుస్తున్న ఆ ఆలయానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని స్ధలపురాణం చెబుతోంది. ఆలయం తొలత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణాలు చెబుతున్నాయి. గంగవంశరాజు గుణశర్మ వారసుడైన.. కళింగ రాజు దేవేంద్రవర్మ క్రీ.శ. 673 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది.


16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్‌గా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్ తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో చెప్పుకున్నారు. ఆయన వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్రను ముందుగానే తెలుసుకుని, ఆలయంలో మూలవిరాట్‌ను ఒక బావిలో పడేశారట.

క్రీ.శ.1778లో ఎలమంచిలి పుల్లాజీ అనే ఆయన ఆ బావిలో మూలవిరాట్‌ను కనుగుని బయటకి తీసి ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ట చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత జిల్లాలోని ఆలుదు గ్రామస్తులైన వరుదు బాబ్జీ దంపతులు ఆలయ వాస్తు నిర్మాణం దెబ్బతినకుండా గర్భగుడిపై విమానాన్ని(గోపురం) పడగొట్టి దక్షిణాది పద్ధతిన కాకుండా ఓఢ్ర (ఒరిస్సా) సంప్రదాయంలో ఆలయాన్ని నిర్మించారు.

మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల్లో వచ్చే ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా "రథసప్తమి" నాడు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1,2,3,4 తేదీల్లోనూ, స్వామివారి ధ్రువమూర్తిపై ఆదిత్యుని తొలికిరణాలు ప్రసరించే దృశ్యాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు అరసవల్లి ఆలయానికి తరలివస్తుంటారు. స్వామివారి పాదాల మీదుగా మొదలై, శరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే ఆ మనోహరమైన దృశ్యం అద్భుతం, అపురూపమని భక్తులు అంటూ ఉంటారు.

ఇకపోతే.. అరసవల్లి క్షేత్రాన్ని స్థానికులు ఆరోగ్య క్షేత్రంగా పిలుస్తారు. ప్రత్యేకించి కంటి వ్యాధులు, బొల్లి, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు భాస్కర స్వామిని కొలుస్తుంటారు.

అరసవల్లికి ఎలా వెళ్లాలంటే..?
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి అనే గ్రామంలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు శ్రీకాకుళం పట్టణం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరం పయనించాలి. శ్రీకాకుళం నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులు అరసవల్లికి చేరుకోవచ్చు.

ఇకపోతే.. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళానికి రైళు లేదా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. చెన్నై, కొల్‌కతా నగరాల నుంచి శ్రీకాకుళం ప్రాంతానికి ప్రత్యేక రైళ్ల రాకపోకలున్నాయి.

అదేవిధంగా హైదరాబాద్, చెన్నై, హౌరా, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, సికింద్రాబాద్‌ల నుంచి కూడా శ్రీకాకుళంకు రైళ్లు నడుస్తున్నాయి. హౌరా మెయిల్, విశాఖ ఎక్స్‌ప్రెస్, కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా శ్రీకాకుళం చేరుకుని అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకోవచ్చు.

శ్రీకృష్ణునికి సంబంధించిన వివిధ మంత్రాలు

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి సంబంధించిన వివిధ మంత్రాలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం.

ఈ మంత్రాలను జపిస్తే సుఖ-శాంతులతోపాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలలో చెప్పబడి ఉంది.

** శ్రీకృష్ణ భగవానుని మూల మంత్రం :
" కృం కృష్ణాయ నమః "

ఇది శ్రీకృష్ణుని మూల మంత్రం. ఎవరైతే తమ జీవితాన్ని సుఖ-శాంతులతో గడపాలనుకుంటున్నారో అలాంటివారు ప్రాతఃకాలాన్నే నిద్రలేచి స్నానపానాదులు కావించి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మనిషి అన్ని రకాల బాధలు, కష్ణాలనుంచి విముక్తుడౌతాడని పురాణాలు చెపుతున్నాయి.

** " ऊँ శ్రీం నమః శ్రీ కృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా "
ఈ మంత్రాన్ని సప్తదశాక్షర మహామంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఐదు లక్షల సార్లు జపిస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది. జపం చేస్తూ హోమం నిర్వహించాలి. ఇలాంటి సమయంలో దశాంశ అభిషేకం, తర్పణం చేయాలని పురాణాలు సూచిస్తున్నాయి. ఎవరికైతే ఈ మంత్రం సిద్ధిస్తుందో వారికి సర్వం లభిస్తుందంటున్నాయి పురాణాలు.

** " గోవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని సప్తాక్షరాల మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని జపించే సాధకులకు అన్నిరకాల సిద్ధులు ప్రాప్తిస్తాయి.

** " గోకులనాథాయ నమః "
అష్టాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అతని కోరికలన్నీ ఫలిస్తాయి.

** " క్లీం గ్లౌం క్లీం శ్యామలాంగాయ నమః "
ఈ దశాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని జపిస్తే అన్ని కోరికలు నెరవేరి అన్నిరకాల సిద్ధులు సిద్ధిస్తాయి.

** " ॐ నమో భగవతే శ్రీ గోవిందాయ "
దీనిని ద్వాదశాక్షర శ్రీ కృష్ణ మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి ఇష్టకామ్యార్థి సిద్ధిస్తుంది.

** " ఐం క్లీం కృష్ణాయ హ్రీం గోవిందాయ శ్రీం గోపీజనవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి వాగీశత్వం ప్రాప్తిస్తుంది.

** " ॐ శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీ "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారి బాధలు తొలగి శుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు.

** " ॐ నమో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే గోపీజనవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి, వారు కోరుకున్న వస్తువులు లభిస్తాయి.

** " లీలాదండ గోపీజనసంసక్తదోర్దండ బాలరూప మేఘశ్యామ భగవన్ విష్ణో స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే ఒక లక్షసార్లు జపిస్తూ నెయ్యి, చక్కెర మరియు తేనెలో నువ్వులు అక్షతలు కలిపి హోమం చేస్తుంటారో వారికి స్థిరమైన లక్ష్మి సిద్ధిస్తుంది.

** " నందపుత్రాయ శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా "
ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ పాలు, చక్కెరతో చేసిన పాయసం ద్వారా హోమం చేస్తారో వారి మనోభీష్టాలు నెరవేరుతాయి.

** " ॐ కృష్ణ కృష్ణ మహాకృష్ణ సర్వజ్ఞ త్వం ప్రసీద మే. రమారమణ విద్యేశ విద్యామాశు ప్రయచ్ఛ మే "
ఈ మంత్రాన్ని జపిస్తే అన్ని రకాల విద్యలు నిస్సందేహంగా ప్రాప్తిస్తాయంటున్నారు పండితులు.

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్


లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్: ఈ లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్ లోపల ఏవ్యక్తిదయిన బ్లాక్& వైట్ పోటో గాని, కలర్ పోటో గాని ఉంచి ఆవ్యక్తికి ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.ఇంకా గ్రహా భాదల నుండి తట్టుకొనే శక్తిని కల్పిస్తుంది .కనుదృష్టి ,నరదృష్టి మొదలయిన దృష్టి దోషాల నుండి రక్షణ కవచం లాగ పనిచేస్తుంది.

లక్ష్మీ ఎనర్జీ బాక్స్ లోపల పెట్టిన టాబ్లెట్స్ వాటి యొక్క ( యం.జి) పెరుగుతుంది. దీనిలోపల పెట్టిన కూరగాయలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.క్యాష్ బాక్స్ గా వాడుకున్నచో థనానికి సంబందించిన సమస్యలు ఉండవు .కాపర్ యంత్రాలు ఈ బాక్స్ లో 45 రోజులు ఉంచిన ఆ యంత్రాలలో శక్తి ఉత్పాదన జరుగుతుంది .

లక్ష్మీ పిరమిడ్ బాక్స్ లో పెట్టిన భూములకు సంబందించిన విలువైన డాక్యుమెంట్లు గాని, ఇంటి డాక్యుమెంట్లు గాని,షాపు, ప్యాక్టరీకి సంబందించిన డాక్యుమెంట్లు ఎల్లప్పుడు ఈ బాక్సులో ఉంచితే భూములు అథిక దరలు పలకడమే కాకుండ,షాపు, ప్యాక్టరీకి సంబందించిన అభివృద్ది బాగుంటుంది.

ఇంకా ఈ పిరమిడ్ బాక్సులో స్టోన్ రింగ్స్,జపమాలలు, ప్యామిలీపోటోలు,లాకెట్స్ ,గోల్డ్ ఐటం మొదలగు వస్తువులేకాకుండా ఈ బాక్సులో పెట్టిన ఏ వస్తువుకైన రెట్టింపు శక్తిని ఇస్తుంది .

జన్మ లగ్నం,జన్మ రాశి,నామ ప్రథమ అక్షరం ద్వారా రుధ్రాక్ష ధారణ.







చూ,చే,చో,ల,లీ,లూ,లే,లో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి ,మేష లగ్నం,మేష రాశి వారికి,మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి "3"ముఖాల రుద్రాక్ష గాని,"1","3","5"ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును."పగడంస్టోన్"ధరించవచ్చును.

ఈ,ఊ,ఏ,ఓ,వా,వీ,వు,వే,వో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, వృషభ లగ్నం వారికి,రాశి వారికి ,భరణి,పుబ్బ ,పూర్వాషాడ నక్షత్రాల వారికి "6" ముఖాల రుధ్రాక్ష గాని, "4","6","7" ముఖాలు కలిగిన రుధ్రాక్షలు గాని కవచం లాగ థరించ వచ్చును."డైమండ్ స్టోన్"ధరించ వచ్చును.
.
కా,కి,కూ,ఖం,ఙ,ఛ,కే,కో,హా ప్రథమ నామాక్షరలు ఉన్న వారికి, మిథున లగ్నం వారికి ,రాశి వారికి ,ఆశ్లేష ,జ్యేష్ట ,రేవతి నక్షత్రాల వారికి "4" ముఖాల రుధ్రాక్ష గాని,"4',"6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచం లాగ గాని థరించ వచ్చును."ఆకుపచ్చ స్టోన్"ధరించ వచ్చును..

హి,హు,హె,హూ,డా,డి,డూ,డే,డో, ప్రథమ నామాక్ష్రాలు ఉన్న వారికి,కర్కాటక లగ్నం వారికి ,రాశి వారికి, రోహిణి,హస్తా ,శ్రవణం, నక్షత్రాల వారికి "2"ముఖాల రుధ్రాక్ష గాని ,"2","3","5", ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచంలాగ గాని ధరించ వచ్చును."ముత్యం స్టోన్"ధరించ వచ్చును.

మా,మీ,మూ,మే,మో,టా,టి,టు,టే ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి,సింహా లగ్నం వారికి,రాశి వారికి, కృత్తిక,ఉత్తర ,ఉత్తరాషాడ నక్షత్రాల వారికి "1"ముఖం గాని, "1","3","5", ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."కెంపు స్టోన్"ధరించ వచ్చును.
.
టో,పా,పి,పూ,ష,ణ,ఢ,పె,పో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కన్య లగ్నం వారికి,రాశి వారికి ,ఆశ్లేష,జ్యేష్ట, రేవతి,నక్షత్రాల వారికి "4"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."ఆకుపచ్చ స్టోన్"ధరించ వచ్చును..

రా,రి,రూ,రె,రో,తా,తీ,తూ,తే,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, తులా లగ్నం వారికి, రాశి వారికి,భరణి,పుబ్బ,పూర్వషాడ,నక్షత్రాల వారికి"6"ముఖాల రుధ్రాక్ష గాని ,"4','6","7"ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును.."డైమండ్ స్టోన్"ధరించ వచ్చును.

తో,నా,నీ,నూ,నే,నో,య,యి,యు,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, వృశ్చిక లగ్నం వారికి, రాశి వారికి, మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి "3"ముఖాల రుధ్రాక్ష గాని,"2","3","5"ముఖాల రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.."పగడంస్టోన్"ధరించవచ్చును. .

యే,యో,బా,బి,బు,ధ,భ,ఢ,బే,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి,థనస్సు లగ్నం వారికి, రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాధ్ర,నక్షత్రాల వారికి "5"ముఖాల రుధ్రాక్ష గాని "1",'3","5"ముఖాల రుధ్రక్షలను కవచం లాగ థరించ వచ్చును."కనక పుష్యరాగం స్టోన్"ధరించ వచ్చును.

బో,జా,జి,జు,జే,జో,ఖా,గ,గి,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, మకర లగ్నం వారికి,రాశి వారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి "7"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."నీలం స్టోన్"ధరించ వచ్చును.

గూ,గే,గో,సా,సి,సు,సే,సో,దా,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కుంభ లగ్నం వారికి, రాశివారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి"7"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7"ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."నీలం స్టోన్"ధరించ వచ్చును.

ది,దు,శ్యం,ఝ,ద,దే,దో,చా,చి,ప్రథమ నామాక్షరలు ఉన్న వారికి, మీన లగ్నం వారికి,రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాథ్ర నక్షత్రాల వారికి"5"ముఖాల రుధ్రాక్ష గాని,"2","3","5"రుధ్రాక్షలను కవచం లాగ ధరించ వచ్చును."కనక పుష్యరాగం స్టోన్"ధరించ వచ్చును.